హీరోయిన్లతో డ్యాన్స్ లే : చిరుపై వైయస్

ఆరోగ్యశ్రీ పథకం కార్పోరేట్ అస్పత్రుల కోసం పెట్టినట్లు చిరంజీవి అంటున్నారని, ఆరోగ్యశ్రీపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పేదలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీలు ప్రజల కోసం పనికిరాని పథకాలను ప్రకటిస్తున్నాయని ఆయన అంటూ ఆ రెండు పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా శాయంపేటలో వైయస్ కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ అంశాన్ని తేల్చాలని పట్టుబడుతూ స్థానికులు ఆయన సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications