నెల్లూరు: తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోమవారం ఏప్రిల్ 20వ తేదీన 60 ఏట అడుగుపెట్టారు. మలివిడత ఎన్నికల పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం రాత్రి నెల్లూరులో బస చేశారు. సోమవారం అక్కడే కార్యకర్తల మధ్య పుట్టినరోజు కేక్ కట్‌చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం తెలుగు యువత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన కడప జిల్లా పొద్దుటూరుకు బయలుదేరి వెళ్లారు. సోమవారం కడప, చిత్తూరు జిల్లాల్లో ఆయన పర్యటన సాగుతుంది.