బాబంటే ఇష్టం: రాహుల్ గాంధీ
హైదరాబాద్: "నేను తెలుగుదేశం నేత చంద్రబాబును ఇష్టపడతాను. ఆయన హైదరాబాద్ ను అభివృద్ధి చేశారు. ఇతర ప్రాంతాల్లో అంత అభివృద్ధి జరగకపోయినా చంద్రబాబు దృక్పధం మాత్రం నాకు నచ్చింది. అది ఆయనపై నాకు అభిమానం కలిగించింది" అని రాహుల్ గాంధీ మంగళవారం మీడియా సమావేశం లో వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ ప్రశంసించడం రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో కలవరం పుట్టించింది. ప్రతిపక్ష నేతను పొగడ్తల్లో ముంచెత్తడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. రాహుల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది..
రాహుల్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారని, అందులో భాగంగానే హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంతోపాటు పాలనపై పట్టున్న వ్యక్తిగా చంద్రబాబు పేరుప్రఖ్యాతులు సంపాదించారని వ్యాఖ్యానించారని కొందరు సీనియర్లు అభిప్రాయపడితే.. ఆయన వ్యాఖ్యలు వైఎస్ వర్గీయులను మాత్రం ఇబ్బందికి గురి చేశాయి. చంద్రబాబు పాలన అవినీతిమయమని తాము ప్రతిరోజూ విమర్శిస్తున్న తరుణంలో రాహుల్ వ్యాఖ్యలు రాజకీయంగా తమకు ప్రతిబంధకంగా మారే ప్రమాదం ఉందని వారు మథనపడుతున్నారు..
ఈ అంశాన్ని టీడీపీ తమకు అనుకూలంగా మలచుకునే వీలుందని ఆందోళనకు గురవుతున్నారు. రాహుల్‌కు రాజకీయ చతురత లేదని, అందుకే ప్రతిపక్ష పార్టీల హయాంలోనూ అభివృద్ధి జరిగిందని అంగీకరించారని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. సీనియర్ల వాదన ఇందుకు భిన్నంగా ఉంది..
చంద్రబాబు పాలనపై పట్టు సాధించారన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా అంగీకరిస్తారని చెబుతూనే.. ముఖ్యమంత్రి వైఎస్ పాలనపై పట్టు సాధించలేకపోయారని బహుళ ప్రచారం జరిగిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అయితే.. రాష్ట్రంలో ఎన్నికల తంతు ముగిసిన తర్వాత రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని చెబుతున్నా.. నైతికంగా మాత్రం కొంత ఇబ్బందికి లోనుకాక తప్పదని అంగీకరిస్తున్నారు.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..!











Click it and Unblock the Notifications