ప్రజాసేవకు పట్టం, టిజి విజయం

వెంకటేష్ సమాజిక సేవా దృక్పథాన్ని ప్రత్యర్ధులు కుడా మెచ్చుకుంటారు. సామాన్య ప్రజల కోసం ఆయన అనేక విద్యాసంస్ధలను నెలకొల్పారు. రోగ నిరోధక చర్యలు, నేత్ర చికిత్సా శిబిరాలు, కుటుంబ నియంత్రణ తదితర సామాజిక సేవాకార్యక్రమాలని ఆయన సొంత డబ్బుతో అమలు చేస్తున్నారు. తన సంస్ధల్లో పనిచేసే సిబ్బందికి నాన్ స్మోకింగ్, నాన్ ఆల్కహాలిక్ అలవెన్సులను ఆయన ఇస్తున్నారు. అంటే సిగరెట్ తాగని, మద్యం సేవించని ఉద్యోగులకు అదనంగా అలవెన్సు ఇస్తారు. ఆ అలవెన్సు భార్యకో, తలిదండ్రులకో అందిస్తారు. గౌరీ గోపాల్ ఎడ్యుకేషనల్ సొసైటీని ఆయన వ్యవస్ధాపించి దాని పరిధిలో అనేక విద్యా సంస్ధలను నిర్వహిస్తున్నారు.
సమాజ శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేయడం వెంకటేష్ ప్రత్యేకత. తెలుగుదేశం ఎమ్మెల్యేగా అయన ఒక పర్యాయం సేవచేశారు. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయనను జేసీస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్, ఫిక్కి, కిన్నెర, విజయశ్రీ, ఉద్యోగశ్రీ, రాజీవ్ రత్న అవార్డులు వరించాయి. బెస్ట్ సేల్స్ టాక్స్ పేయర్ అవార్డు కూడా లభించింది.
వెంకటేష్ కుమారుడు టిజి భరత్ కొత్తతరం దార్శనికుడు. ఎంబీఏ చదివిన ఈయన రాయలసీమ హై స్ట్రెంగ్త్ హైపో లిమిటెడ్ సిఎండీగా ఉన్నారు. టిజివి ఇన్ఫోసిస్టమ్స్, టిజివి ప్రాజెక్ట్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ ప్రై. లిమిటెడ్, శ్రీ రాయలసీమ డచ్ కేసెన్ బౌ లిమిటెడ్ కు చైర్మన్ గా సేవలు అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications