తప్పు నాది కాదు: అల్లు అరవింద్

ఎవరెవరికి టికెట్లు ఇచ్చింది, ఎవరెవరు చెప్తే ఇచ్చిందీ, ఏ పరిస్థితుల్లో ఇచ్చిందీ అన్ని వివరాలపై నివేదిక ఉందని, అవసరమైతే చూపించడానికి సిద్ధమేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ వాదనతో పార్టీ ముఖ్యులు ఏకీభవించినట్లు తెలుస్తోంది. పార్టీలో కొత్తదనం లేకపోవడమే అపజయానికి కారణమని భావించినట్లు తెలుస్తోంది.
కుమ్మక్కయి బలహీనమైన అభ్యర్థులను పోటీకి పెట్టామనే ప్రచారం కూడా దెబ్బ తీసిందని అభిప్రాయపడినట్లు సమాచారం. చిరంజీవిపై ప్రజల్లో అనుకూలత ఉందని, ఇకపై మీడియాను పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications