జూన్ 1న శాసనసభ సమావేశం
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 13వ శాసనసభ జూన్ 1న సమావేశం కానుంది. అదేరోజు కొత్త సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. 2న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అనంతరం గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 3,4,5 తేదీల్లో సభ సమావేశమై గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు జూన్, జులై నెలల్లో 24 రోజులపాటు జరుగుతాయి.
ఈ నెల 25వ తేదీన లేదా 26వ తేదీన ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆయన మంత్రివర్గంలో 20కి కొంచెం అటూ ఇటుగా మంత్రులు ఉండవచ్చునని భావిస్తున్నారు. మంత్రివర్గ జాబితాకు ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోద ముద్ర వేయించుకున్నారు.












Click it and Unblock the Notifications