మరో ఆరు మంత్రి పదవులు: మమత

Mamata Banerjee
కోల్ కత్తా: తమ పార్టీకి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మరో ఆరు మంత్రి పదవులు లభిస్తాయని కేంద్ర క్యాబినెట్ మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ చెప్పారు. తొలి విస్తరణలోనే తమ సభ్యులకు మంత్రి పదవులు ఇస్తారని ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పశ్చిమ బెంగాల్ నుంచి తమ ప్రాతినిధ్యమే ఎక్కువని ఆమె అన్నారు.

కాంగ్రెసు తర్వాత తమదే అతి పెద్ద పార్టీ అని, తాము ఇంకా ఎక్కువ మంత్రి పదవులు అడగడానికి అవకాశం ఉందని, అయితే తాము ఆ పని చేయడం లేదని ఆమె అన్నారు. ప్రజలకు సేవ చేయడానికే మంత్రి పదవులు తీసుకుంటున్నామని ఆమె చెప్పారు. మంత్రి పదవులు తమకు లెక్క కాదని, డబ్బులు చేసుకోవడానికి తాము ప్రభుత్వం చేరడం లేదని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+