అలా అయితే పోటీ చేయం: చిరు

Chiranjeevi
హైదరాబాద్‌: ఇటీవల గుండెపోటుతో మరణించిన రేవతిపతి కుటుంబ సభ్యుల్లో ఒకరు పోటీ చేస్తే తాము టెక్కలి శాసనసభా నియోజకవర్గంలో పోటీ నుంచి తప్పుకుంటామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చెప్పారు. మానవీయ కోణంలో ఆలోచించి తాము ఆ నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరగడం శుభపరిణామమని ఆయన అన్నారు. మహిళా బిల్లును తాము స్వాగతిస్తున్నట్లు ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులకు తెలిపారు. రాష్ట్రపతిగా మహిళ ఉండడం, ఈ సమయంలో మహిళా బిల్లు రావడం సంతోషకరమని ఆయన అన్నారు.

రేవతీపతి కుటుంబం నుంచి ఒకరకి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంతాపతీర్మానంపై మంత్రి మాట్లాడుతూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అయితే దీనిపై వామపక్షాలు సానుకూలంగా స్పందించాయి. రేవతీపతి కుటుంబం నుంచి ఒకరికి అవకాశం ఇస్తే తమ పార్టీ తరుఫున అభ్యర్థిని నిలబెట్టమని సీపీఐ ఎమ్మెల్యే జి.మల్లేశం తెలిపారు. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+