రుజువైతే రాజకీయాలకు స్వస్తి: ఎమ్మెల్యే
ఏలూరు: నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం జరిపి ఆమెను హత్య చేసినట్లు నేరం రుజువు అయితే తాను రాజకీయం నుండి వైదొలగుతానని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు టీవీ రామారావు అన్నారు. సొంత పూచికత్తుపై ఆయన బెయిలుపై విడుదలయ్యారు. అనంతరం ఆయన తన నివాసంలో అనుచరులు, కార్యకర్తల సమక్షంలో మాట్లాడారు. తాను ఈ అఘాయిత్యానికి పాల్పడలేదని, అన్యాయంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని రామారావు అన్నారు.
నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం ఆరోపణలతో చెలరేగిన వివాదంలో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే టీవీ రామారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు సొంత పూచి కత్తుపై శుక్రవారం ఉదయం విడుదల చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్, ఎస్ పి సమీక్షించి క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications