ఇస్లామాబాద్: హాలీవుడ్ నటి అంజలినా జోలీకి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఫోన్ చేసి కృతజ్జతలు తెలిపారు. దేశంలోని తాలిబాన్ వ్యతిరేక సైనిక చర్య వల్ల ఆశ్రయం కోల్పోయినవారి సహాయార్థం పది లక్షల డాలర్లను అంజలినా జోలీ ఆర్థిక సహాయం చేసింది. ఇందుకు గాను ఆమెకు జర్దారీ కృతజ్ధతలు తెలిపారు.
జోలి పిట్ ఫౌండేషన్ కు సంబంధించి బ్రాడ్ పిట్ కు కూడా ఆయన కృతజ్ఝతలు తెలిపారు. వారిద్దరు కలిసి ఆ ఫౌండేషన్ ను నడుపుతున్నారు. పాకిస్తాన్ ను సందర్శించాల్సిందిగా ఆయన వారిద్దరిని ఆహ్వానించారు.