ఎమ్మెల్యే ఫ్యామిలీ దీక్ష భగ్నం
హైదరాబాద్: కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు కుటుంబ సభ్యుల నిరాహార దీక్షను పోలీసులు గురువారం రాత్రి భగ్నం చేశారు. టీవీ రామారావుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ నిరహారదీక్ష చేపట్టిన ఆయన కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితి క్షిణిస్తోంది. గత నాలుగు రోజులుగా హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఎమ్మెల్యే, ఆయన కుటుంబసభ్యులు నిరశన దీక్ష చేపట్టిన విషయం విదితమే.
అయితే గురువారం రాత్రి వారిని పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం క్షిణించిందని తేల్చారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి వారి దీక్షను భగ్నం చేశారు. వారిని బలవంతంగా గాంధీ ఆస్పత్రికి, అక్కడినుంచి యశోద ఆస్పత్రికి తరలించారు. వారు త్వరలోనే కోలుకుంటారని వైద్యులు తెలిపారు. తన కొడుకు ఏ తప్పు చేయలేదని, చేయని నేరానికి ఇరికించారని ఎమ్మెల్యే తల్లి విలపిస్తోంది.












Click it and Unblock the Notifications