ఏలూరు: నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేశారనే ఆరోపణపై తెలుగుదేశం కొవ్వూరు శాసనసభ్యుడు టీవీ రామారావును సిబిసిఐడి అధికారులు సోమవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని ఆయన నివాసానికి వెళ్లి సిబిసిఐడి అధికారులు ఆయనను అరెస్టు చేశారు. సిబిసిఐడి అధికారులు అందుకు ఏలూరు పోలీసుల సహకారం కూడా తీసుకున్నారు.
అరెస్టు సందర్భంగా రామారావు నుంచి గానీ, ఆయన అనుచరుల నుంచి గానీ ఏ విధమైన ప్రతిఘటన కూడా ఎదురు కాలేదు. ఏ విధమైన ఆందోళనలు చేపట్టవద్దని ఆయన తన అనుచరులకు సూచించినట్లు సమాచారం. అరెస్టు సందర్భంగా రామారావు ఏమీ మాట్లాడలేదు.