6న టిడిపిలో దేవేందర్ గౌడ్

సహజంగా తాను కాంగ్రెస్ వ్యతిరేకినని, కాంగ్రెస్ అనుకూల వైఖరి తీసుకోవడంవల్లే పీఆర్పీని విడిచి పెట్టాల్సి వస్తోందని ఈ సమావేశంలో అనుచరులకు వివరించనున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ వ్యతిరేక వైఖరి అవలంభించాలని, అప్పుడే పార్టీకి మనుగడ ఉంటుందని పీఆర్పీ ముఖ్యనేతలకు తాను చెప్పిన విషయాన్ని కూడా ఈ సమావేశంలో వెల్లడించనున్నట్టు సమాచారం. పీఆర్పీ కాంగ్రెస్ వ్యతిరేక వైఖరి తీసుకునేలా ఎంత గట్టిగా ప్రయత్నించినా సాధ్యం కాలేదని వివరించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలను అణచేయాలని చూస్తోందని, దానిని ఎదుర్కొనే సత్తా ఇప్పుడున్న పార్టీల్లో కేవలం టీడీపీకే ఉందని అనుచరులకు చెప్పనున్నట్టు సమాచారం.
అనుచరులతో సోమవారం సమావేశమవుతున్న నేపథ్యంలో టీడీపీలో చేరాల్సిన తేదీ, వేదికల గురించి మాట్లాడేందుకు దేవేందర్ గౌడ్ చంద్రబాబుకు ఫోన్ చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా తన చేరికపై తలసాని శ్రీనివాస్‌యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, అరవింద్‌కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన కూడా వచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications