గౌడ్ ను చేర్చుకుంటే వెళ్లిపోతా: తలసాని

దేవేందర్ గౌడ్ చేసిన విమర్శలపై వివరణ ఇప్పించాలని తాను చంద్రబాబును కోరినట్లు ఆయన తెలిపారు. దేవేందర్ గౌడ్ చేసిన విమర్శలకు కింది స్థాయి నాయకులు చాలా బాధపడ్డారని ఆయన చెప్పారు. దీనికి దేవేందర్ గౌడ్, చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబునే కాదు, చిరంజీవిని కూడా దేవేందర్ గౌడ్ మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ తాను పార్టీనుంచి వెళ్లాల్సి వస్తే ఒక్కడినే వెళ్తానని ఆనయ అన్నారు. ఎవరిని కూడా తనతో తీసుకెళ్లబోనని ఆయన స్పష్టం చేశారు. దేవేందర్ గౌడ్ బేషరతుగా పార్టీలో చేర్చుకుంటే తాను పార్టీని వీడిపోతానని ఆయన హెచ్చరించారు.
ప్రజారాజ్యం పార్టీకి 40 దాకా సీట్లు వచ్చి, తాను పార్లమెంటుకో, శాసనసభకో ఎన్నికై ఉంటే తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వచ్చేవారా అని ఆయన అడిగారు. అయితే పార్టీలో దేవేందర్ గౌడ్ చేరికను తాను వ్యతిరేకించబోనని, పార్టీ సిద్ధాంతాలను, పార్టీ అధ్యక్షుడ్ని తిట్టినందుకు మాత్రం దేవేందర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications