రాజీనామాలు చేస్తాం: ఎమ్మెల్యేలు

YS Jagan
కడప: కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి నాలుగు రోజుల్లో కాంగ్రెసు శాసనసభా పక్ష (సిఎల్పీ) సమావేశాన్ని ఏర్పాటు చేయకపోతే రాజీనామా చేస్తామని నలుగురు కడప పార్టీ శాసనసభ్యులు పార్టీ అధిష్ఠానాన్ని హెచ్చరించారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కమలమ్మ, అమరనాథ్ రెడ్డి మంగళవారం ఆ హెచ్చరిక చేశారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తూ వారు కడప జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.

జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెసు జడ్పీటీసిలు మంగళవారం కడప జిల్లా పరిషత్ సమావేశాన్ని అడ్డుకున్నారు. వారికి మద్దతుగా కడప జిల్లాకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యులు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ, జగన్ చిన్నాయన వైయస్ వివేకానంద రెడ్డి కూడా పాల్గొన్నారు. దీన్ని బట్టి ముఖ్యమంత్రి పదవి విషయంలో జగన్ వెనక్కి తగ్గే ఉద్దేశంతో లేరని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+