అద్వానీ నేతగా ఉండరు: వెంకయ్య

ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే కొత్త నాయకుడు వస్తాడని ఆయన చెప్పారు. అప్పటికి ఎవరు నాయకత్వం వహిస్తారని అడిగితే రాజకీయ పార్టీలు సమస్యల గురించి చర్చిస్తాయని, ఒక అభిప్రాయానికి వచ్చి అవసరాన్ని బట్టి ఏకాభిప్రాయ సాధన ద్వారా నాయకుడు వస్తాడని ఆయన సమాధానమిచ్చారు. అద్వానీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నామని, ఎప్పుడు దిగిపోవాలనే విషయంపై అద్వానీ నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు.
కొత్త నేతకు ఎప్పుడు అవకాశమిస్తారనేది అద్వానీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉందని, అందుకు అద్వానీకి గడువు ఏదీ పెట్టలేదని ఆయన చెప్పారు. రెండో సారి వరసగా ఓటమి పాలైనప్పుడు సహజంగా కొంత నైతిక స్థయిర్యం దెబ్బ తింటుందని, ఆ సమయంలో మార్గదర్శకత్వం వహించాలని కోరామని, సాధారణ ప్రక్రియలోనే నాయకత్వ మార్పిడి జరుగుతుందని, కొత్త నేతను ఎన్నుకునేది ఎప్పుడనేది అద్వానీ ప్రకటిస్తారని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications