చారిటీలకు ఒబామా నోబెల్ డబ్బులు

అవార్డును తీసుకోవడానికి ఒబామా స్వయంగా ఓస్లో వెళ్తారని శ్వేతసౌధం అధికార ప్రతినిధి రాబర్ట్ గిబ్స్ చెప్పారు. తనకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందని ఒబామా ఊహించలేదని, ఒబామా అవార్డు ప్రకటన వెలువడగానే ఆశ్చర్యపోయారని ఆ ప్రతినిధి చెప్పారు. ఇది ఒక వ్యక్తి సాధించిన విజయం కాదని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆశలు ఇందులో ఇమిడి ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచాన్ని అణ్వస్త్ర నిరోధంగా మార్చాలనే వారి ఆశలకు, మధ్యప్రాచ్యంలో పరిస్థితి మారాలనే వారి ఆకాంక్షలకు ఇది అద్దం పడుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications