గొడ్డు మాంసం తిన్పించిన ఎన్నారై భర్త నుంచి విడాకులు

అతను ఆమెను ఆల్కహాల్ తాగమని బలవంతపెట్టేవాడు. ఆమె అర్ధనగ్న చిత్రాలను వెబ్ సైట్ లో పోస్ట్ చేశేవాడు. వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తులు ఆమెకు కింది కోర్టు ఇచ్చిన విడాకులను ఖరారు చేశారు. " విదేశంలో స్ధిరపడిన యువకుడికి తమ కూతురుని ఇచ్చి పెళ్ళి చేయాలనుకునే వారికి ఈ కేసు కనువిప్పు కావాలి. యువకుడీ ప్రవర్తన గురించి వాకబు చేయకుండా పెళ్ళి చేస్తే ఇలాగే జరుగుతుంది" అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఈ కేసులో భార్య మనోవర్తి కోరలేదు. తన అభ్యంతరకరమైన ఫోటోలను వెబ్ సైట్ లో ఉంచినందుకు కాను అతనిపై క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోడానికి ఆమె నిరాకరించింది.












Click it and Unblock the Notifications