గ్రేటర్ పార్టీ పదవికి దానం నాగేందర్ రాజీనామా

Danam Nagender
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేశారు. టికెట్లు అమ్ముకున్నారని వచ్చిన ఆరోఫణలపై తాను మనస్ధాపం చెందానని దానం చెప్పారు. ఆయన తన రాజీనామా లేఖను పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ కు అందజేశారు.

'గ్రేటర్‌' కాంగ్రెస్‌ లో టికెట్ల చిచ్చు నిన్ననే మొదలైంది. డబ్బులిచ్చిన వారికే టికెట్లు ఇచ్చారన్న ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. గ్రేటర్‌ అధ్యక్షుడు దానం నాగేందర్‌ ఇంటి ముందు నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. స్థానిక నేతలు ఆగ్రహానికి కూకట్‌పల్లిలోని పార్టీ కార్యాలయం ధ్వంసమైంది. కార్యకర్తలు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. నేతల ఆందోళనతో దానం ఇంటి వద్ద, కూకట్‌పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన క్షణంలోనే కాంగ్రెస్‌లో అసమ్మతి భగ్గుమంది.

గురువారం రాత్రే ఆ పార్టీకి చెందిన వివిధ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు అధిష్ఠానం తీరుపై విరుచుకుపడ్డారు. ప్రత్యేకించి వైఎస్‌ జగన్‌వర్గానికి తీవ్ర ఆన్యాయం జరిగిందంటూ నిప్పులు చెరిగారు. ముషీరాబాద్‌ ఎమ్మెల్యే టి.మణెమ్మ నగర కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శి వాజిద్‌హుస్సేన్‌ తో పాటు దాదాపు రెండు వందల మంది పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రేటర్‌ అధ్యక్షుడు దానం నాగేందర్‌ ఇంటి ముందు ధర్నాకు దిగారు. అక్కడ కనిపించిన నేతలపై డాడి చేశారు. భోలక్‌ పూర్‌ డివిజన్‌కు సి.కృష్ణ పేరు ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దానంకు వ్యతిరేకంగా నిదాలు చేశారు. మజ్లిస్‌కు అనుకూలంగా కావాలనే బలహీనమైన అభ్యర్థిని ప్రకటించారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+