ఆంజనేయ స్వామే నాకు పేరు పెట్టారేమో: చిరు

"తొలి సినిమా పునాదిరాళ్లు 1978లో షూటింగ్ చేస్తున్న సమయంలో శివశంకర వరప్రసాద్ అనేపేరు స్క్రీన్‌కి చాలా ఆడ్‌గా, పెద్దదిగాను ఉంటుంది. ఒకరోజు కలలో నేనెక్కడో గుడిలో ఉంటే బయట నుంచి నా స్నేహితుడు చిరంజీవీ.. రా అన్నాడు. ఎవర్ని పిలుస్తున్నావంటే నిన్నే అన్నాడు. అప్పటి దాకా చిరంజీవి అనే ఒక పేరు ఉంటుందని కూడా నాకు తెలీదు. ఆ విషయం అమ్మకి చెప్పాను. ఆంజనేయస్వామికి మరో పేరు చిరంజీవి అని, స్క్రీన్ నేమ్‌గా ఆ పేరును ఎందుకు ఆలోచించకూడదని చెప్పింది. నేను పూజించే ఆరాధ్యదైవం ఆంజనేయస్వామే చెప్పారా అనిపించింది. చాలా దైవికంగా కలలో స్ఫురించిన పేరిది. అమ్మ ఆమోదించింది. తర్వాత పునాదిరాళ్లు టైంలో ఏదో ఇంటర్వ్యూ జరుగుతుంటే నీ పేరు.. అని అడిగితే చిరంజీవి అనేశాను. అప్పట్నుంచి అదే స్థిరపడింది." అని చిరంజీవి చెప్పారు.












Click it and Unblock the Notifications