వీరప్ప మొయిలీ హైదరాబాద్ పర్యటన రద్దు

Veerappa Moily
న్యూఢిల్లీ: కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ రాష్ట్ర పర్యటన రద్దయింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఆయన గురువారం హైదరాబాద్ రావాల్సి ఉంది. అయితే ఆయన హైదరాబాద్ రావడం లేదు. అంతేకాకుండా ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పార్టీ అధిష్టానం నుంచి ఎవరూ పాల్గొనబోరని మొయిలీ ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ తో అన్నారు. తాను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని కూడా ఆయన చెప్పారు.

మొయిలీ హైదరాబాద్ పర్యటన రద్దు కావడం ఇది రెండో సారి. ఈ నెల మొదటి వారంలో ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అభ్యర్థుల ఖరారుకు హైదరాబాద్ రావాల్సి ఉండింది. అ సమయంలో కూడా ఆయన పర్యటన రద్దయింది. ఇప్పుడు మరోసారి రద్దయింది. అయితే, జగన్ శిబిరం పూర్తిగా తమ చెప్పుచేతుల్లోకి రాలేదని పసిగట్టి ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్లు భావిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల పూర్తిగా దారిలోకి వచ్చాయని భావించి ఆయన గతంలో హైదరాబాద్ వచ్చారు. కానీ పరిస్థితి తాము భావించినంత సజావుగా లేవని గమనించి మరింత కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+