కెసిఆర్ అరెస్టుకు ఎన్నారైల ఖండన

కెసిఆర్ అరెస్టును తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ (తెనా) ఒక ప్రకటనలో ఖండించింది. కెసిఆర్ ను బేషరతుగా విడుదల చేయాలని తెనా ప్రతినిధి వెంకట్ మారోజు డిమాండ్ చేశారు. కెసిఆర్ ను అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం ఫాసిస్తు వైఖరిని ప్రదర్శించిందని సంఘం విమర్శించింది. కెసిఆర్ నిరాహార దీక్షను భగ్నం చేసిన తీరు మారోజు ఖండించారు. తెలంగాణ అంతటా పోలీసు నిర్బంధం సాగించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ చారిత్రక సందర్భంలో తెలంగాణ కోసం గొంతెత్తాలని ఆయన తెలంగాణ మంత్రులను, ప్రజా ప్రతినిధులను కోరారు. ప్రభుత్వ ఫాసిస్టు వైఖరిని ఖండించాలని ఆయన తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, ప్రజారాజ్యం పార్టీలను కోరారు.












Click it and Unblock the Notifications