తెలంగాణ తీర్మానం పెడితే మద్దతు: చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం పెడితే తాము మద్దతిస్తామని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి విద్యార్థులకు హామీ ఇచ్చారు. శనివారం విద్యార్థులు చిరంజీవి నివాసానికి వెళ్లి తెలంగాణకు మద్దతు కోరారు. తెలంగాణ విద్యార్థులతో ఆయన మాట్లాడి తన సంఘీభావం తెలిపారు. ఆయన శనివారం నిమ్స్ లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఎన్నికల్లో ప్రకటించినట్లుగా తాము సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. కెసిఆర్ ఆరోగ్యం క్షీణించిందని, దీనిపై ముఖ్యమంత్రి కె. రోశయ్య వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కెసిఆర్ ఆరోగ్యం బాగా లేదని ఆయన అన్నారు. హరిరామజోగయ్య పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఆ విషయం తనకు తెలియదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+