వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జై తెలంగాణ అన్ననటుడు సునీల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sunil
హైదరాబాద్: తెలుగు హాస్య నటుడు సునీల్ చేత తెలంగాణ ఆందోళనకారులు జై తెలంగాణ అనిపించారు. జై తెలంగాణ అనే దాకా ఆయనను వారు వదిలిపెట్టలేదు. ఈ సంఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. వికారాబాద్ రైల్వే స్టేషనులో మర్యాద రామన్న షూటింగ్ జరుగుతోందని తెలుసుకున్న తెలంగాణ ఆందోళనకారులు అక్కడికి చేరుకున్నారు. షూటింగ్ ను అడ్డుకున్నారు. సునీల్ ను చుట్టుముట్టి జై తెలంగాణ అనిపించారు. సునీల్ నటిస్తున్న మర్యాద రామన్న చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.

హైదరాబాదులో సోమవారం ప్రముఖ నటి రోజా గోలీమార్ సినిమా షూటింగును తెలంగాణ ఆందోళనకారులు అడ్డుకున్నారు. అంతకు ముందు హీరోలు మనోజ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల షూటింగులను కూడా తెలంగాణ ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఇలాంటి అడ్డంకులపై సినీ పరిశ్రమ నుంచి విమర్శలు వస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X