హైదరాబాద్: రెండు జిల్లాల్లో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్లు బూటకమని విప్లవ రచయిత సంఘం (విరసం) నేత వరవరరావు ఆరోపించారు. పోలీసుల అదుపులో ఉన్న మరో ముగ్గురిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్ కు గురైన శాఖమూరి అప్పారావు, సోలిపేట కొండలరెడ్డిని పోలీసులు ఈ నెల 10వ తేదీన చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలోని అంజిమేడు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
శాఖామూరి అప్పారావు ఎన్ కౌంటర్ ను మరో విరసం నేత కళ్యాణ రావు ఖండించారు. శాఖమూరి అప్పారావుది బూటకం ఎన్ కౌంటర్ బూటకమని ఆయన ఆరోపించారు. తమ సోదరుడు సోలిపేట కొండల రెడ్డిని కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేసినా పట్టించుకోకుండా ఎన్ కౌంటర్ చేశారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు సోలిపేట రామలింగా రెడ్డి ఆరోపించారు.