సాహితీవేత్త భరాగో కన్నుమూత

Bhamaidipati Ramagopalam
విశాఖపట్నం: ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత భమిడిపాటి రామగోపాలం (భరాగో) బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. సాహితీ ప్రియులకు భరాగో చిరపరిచితుడు. ఆయన సర్వేయర్, పోర్డు ఉద్యోగాలు చేశారు. ఆయన రచించిన కథా సంకలనం ఇట్లు మీ విధేయుడుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

ఆయన మరో కథా సంకలనం వంటొచ్చిన మొగాడు ఓ సంచలనం. సినీ నేపథ్య గాయకుడు ఘంటశాలకు ఆయన మంచి మిత్రుడు. సాహిత్య, సంగీత విలువలతో కూడిన నూట పదహారు కొత్త సినిమా పాటలతో సినిమా సిడిని ఆయన తీసుకు వచ్చారు. పి. సుశీల, భానుమతిలపై ఆయన సావనీర్లు ప్రచురించారు. 78 ఏళ్ల భరాగోకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+