అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిటాల సునీతను కలిసిన కర్ణాటక మంత్రి

By Santaram
|
Google Oneindia TeluguNews

Paritala Sunitha
రామగిరి (అనంతపురం జిల్లా): పరిటాల రవి భార్య, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను కర్ణాటక రాష్ట్ర పట్టుపరిశ్రమ, చిన్నపరిశ్రమల శాఖ మంత్రి వెంకటరమణప్ప సామాజిక సేవ విషయంలో కలిశారు. పరిటాల ట్రస్టు ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వివాహాల గురించి తెలుసుకున్నారు. మంగ ళవారం ఆయన వెంకటాపురంకు విచ్చేశారు. పరిటాల సునీత చేపట్టిన ఉచిత వివాహల నిర్వహణ ఏర్పాట్లు తెలుసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి ఉచిత వివాహాలు చేసుకోవడానికి వస్తుండటంతో వధూవరుల పేర్లు ఎలా నమో దు చేస్తున్నారో తెలుసుకున్నారు.

పెళ్ళిళ్ళ ఏర్పాట్లు, పోస్టర్లు గురించి ఎమ్మెల్యేతో సమీక్షించారు. పరిటాల రవీంద్ర ఉన్నప్పుడు రెండుసార్లు ఉచిత వివాహాలు నిర్వహించారని, ఆ సమయంలో తాము ఆయన వెంట ఉన్నామని మంత్రి అన్నారు. ఇప్పుడు కూడా అదేవిధంగా పరిటల ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత వివాహాలకు తాము సహాయసహకారాలు అందిస్తామన్నారు. పరిటాల కుటుంబం ఏ సాయం చేసినా అది పేదలకు ఉపయోగంగా ఉంటుందన్నారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో పెళ్ళి చేయలేని ఎంతో మంది ఆడపిల్లల తల్లిదండ్రులకు పరిటాల సునీత అండగా నిలుస్తోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X