బెంగళూర్: కర్నాటక రాజధాని బెంగుళూరలోని రెసిడెన్సీ రోడ్డులో గల కోణార్క్ హోటల్లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించలేదు. హోటల్లోని పెంట్ హోస్ లో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ప్రమాదం సంభవించిన వెంటనే కస్టమర్లను వెంట వెంటనే బయటకు పంపించేశారు.
తాజా సమాచారం ప్రకారం 11 పైరింజన్లు మంటలను ఆర్పడంలో నిమగ్నమయ్యాయి. షార్ట్ సర్య్యూట్ వల్లనే ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు.