హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధరలపై విపక్షాలు హర్తాల్: అరెస్టులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్‌: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్షాలు మంగళవారం ప్రత్యక్ష ఆందోళనకు దిగాయి. 13 ప్రతిపక్ష పార్టీలు ఇవాళ దేశవ్యాప్తంగా హర్తాళ్‌ కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా తెలుగుదేశం, వామపక్షాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలకు దిగాయి. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరులో టిడిపి, వామపక్షాల కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఒంగోలులో బస్సుల రాకపోకలను అడ్డుకున్న ఆందోళనకారులను అరెస్టుచేశారు.

నల్గొండజిల్లాలో తెల్లవారు జామునుంచే తెలుగుదేశం, సీపీఎం, సీపీఐ పార్టీల కార్యకర్తలు వీధుల్లో సంచరిస్తూ ఆందోళనకు దిగారు. హర్తాళ్‌ కు సహకరించాలని అన్ని వర్గాల ప్రజలను కోరారు. బంద్‌ కారణంగా 9వనెంబరు జాతీయరహదారి బోసిపోయింది. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం, సీపీఎం, సీపీఐ కార్యకర్తలు ఉదయాన్నే ఎన్టీఆర్‌ బస్టాండ్‌ చేరుకుని బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావుతోపాటు, పలువురు కార్యకర్తలను అరెస్టుచేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, అమలాపురంల్లో కూడా ప్రతిపక్షాల కార్యకర్తలు బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X