ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మరో పథకం అమలుకు నిర్ణయం..!!
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనేక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అమరావతి లో నిర్మాణాలు.. భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. APSP లోని 2, 3, 5, 6, 9, 11, 14, 16వ బెటాలియన్లలో పనిచేస్తున్న ప్రస్తుతం 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్‌పెక్టర్లుగా స్థాయిని పెంచడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇరిగేషన్.. రెవిన్యూ అంశాల పైన చర్చించిన మంత్రివర్గం పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఉపాధి కల్పనకు సంబంధించి కొత్త పథకానికి ఆమోదం తెలిపారు.
ఏపీ మంత్రివర్గ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పారిశ్రామిక ప్రాజెక్టులు సరైన సమయం లో అమలు జరగడానికి, పారిశ్రామికవేత్తలు బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల నుండి రుణ సహాయం సులభంగా పొందడానికి, రాష్ట్రంలో వ్యాపారం చేయడం మరింత సులువు చేయడానికి, పెట్టుబడులు వేగవంతం చేయడానికి మరియు ఉపాధి అవకాశాలు పెంచడానికి అవసరమైన చర్యలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎలాంటి అభ్యంతరాలు లేని 66,157 ఎకరాల ఏపీఐఐసీ భూములను సెక్షన్ 22-A నిషేధిత జాబితా నుంచి తక్షణమే తొలగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (AP-CMEGP)' పేరిట ప్రతిపాదిత పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దాదాపు 3,500 మంది మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్లకు వారి తయారీ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందనుంది.

కీలక ప్రతిపాదనలకు ఆమోదం
అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రెటేరియట్ & HoD కార్యాలయాలు (GAD టవర్, టవర్లు 3 & 4 మరియు టవర్లు 1 & 2)లో హై సైడ్ ఎలక్ట్రికల్, HVAC, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, లిఫ్ట్‌లు, ఫైర్ అలారం & పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మరియు ప్లంబింగ్ వర్కుల MEP పనులకు రూ.2,316.88 కోట్ల మొత్తానికి రాష్ట్ర మంత్రి మండలి పరిపాలన ఆమోదం తెలిపింది. అమరావతిలోని నీరుకొండ (V)లో EPC కాంట్రాక్ట్ పద్ధతిలో 'తెలుగు కల్చరల్ సెంటర్' నిర్మాణ పనులకు GST మరియు ఇతర నిబంధనలతో కలిపి రూ.119.27 కోట్ల మొత్తానికి రాష్ట్ర మంత్రి మండలి పరిపాలన ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో మిషన్ శక్తి కింద 'సఖి నివాస్ పథకం' (క్రెష్ సదుపాయంతో కూడిన వర్కింగ్ విమెన్ హాస్టళ్ళు) అమలు చేయడానికి ఆమోదం తెలిపింది.
-
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
ఏపీలో కొత్త లోక్సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు రేపే-లోకేష్ కీలక ప్రకటన..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్-ఉత్తీర్ణతా శాతాలివే..! సప్లిమెంటరీ షెడ్యూల్..! -
AP Inter Results 2026 Release: ఇంటర్ ఫలితాల విడుదల -ఇలా చెక్ చేసుకోండి..! -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!!












Click it and Unblock the Notifications