వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజాప్రతినిధులకు పోలీసుల లక్ష్మణరేఖలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
రంపచోడవరం: ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులో ప్రజాప్రతినిధులెవరూ లోతట్టు, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని పోలీసులు సూచనలు జారీ చేశారు. సోమవారం విశాఖ జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఉండ్రంగి సోమలింగాన్ని మావోయిస్టులు కాల్చి చంపిన నేపథ్యంలో పోలీసు శాఖ ప్రజాప్రతినిధుల కదలికలపై ఆంక్షలు విధిం చింది. ఉన్నతాధికారులు సైతం లోతట్టు ప్రాంతాలకు వెళ్లకూడదని, ఆయా ప్రాంతాల పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో తూర్పు ఏజెన్సీలో జరగాల్సిన ప్రజాపథం కార్యక్రమాలను కూడా అధికారులు రద్దుచేసుకుంటున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా పోలీసులు సమాచారం పంపారు. మరోపక్క తూర్పు, విశాఖ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్‌ ఆపరేషన్లు ముమ్మరం చేశారు.

ఇవే కాకుండా తూర్పు సరిహద్దులోని విశాఖ గ్రామాలు గూడెం కొత్తవీధి, కొయ్యూరు అటవీ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఓ ప్రైవేటు వాహనంపై దాడి చేసిన నేపథ్యంలో పోలీసు నిఘాను కట్టుదిట్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటు న్న గిరిజన ప్రజాప్రతినిధులందరికీ తగిన మార్గదర్శకాలు జారీచేశామని రంపచోడవరం ఏఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ తెలిపారు. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు తమ వద్ద సమర్ధమంతమైన బలగాలు సిద్ధంగా ఉన్నాయ న్నారు. పోలీసుల సూచనల మేరకు రంపచోడవరం ఎమ్మెల్యే కె.కె.వి.వి.వి. సత్యనారాయణరెడ్డి తన పలు పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఈనెల 14న జరగాల్సిన ఐటీడీఏ పాలకమండలి సమావేశాన్ని వాయిదా వేశారు. సోమవారం రాత్రి నుంచీ రాజవొమ్మంగి, జెడ్డంగి పోలీస్‌ స్టేషన్ల ఎదుట ద్విచక్ర వాహనాలతో సహా, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లా వైపు నుంచి వస్తున్న వాహనాలు, వాహనదారుల వివరాలను సీఐ ఆర్‌.రామచంద్రరావు ఆధ్వర్యంలో సేకరిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X