తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రెస్ కోడ్: కురుచ దుస్తులతో తిరుమలలో నో ఎంట్రీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుమల: శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల వస్త్రధారణపై తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆంక్షలు విధించింది. కురుచ దుస్తులు ధరించే వ్యక్తులను స్వామివారి దర్శనానికి అనుతించరాదని టిటిడి నిర్ణయించింది. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు చేసిన ఫిర్యాదుపై టిటిడి ఎగ్జిక్యూటివ్ అధికారి కృష్ణారావు ఆ నిర్ణయాన్ని వెల్లడించారు.

వస్త్రధారణపై గతంలో కూడా పలు ఫిర్యాదులు అందాయని, దీనిపై ఒకటి రెండు నెలల పాటు భక్తులకు అవగాహన కల్పించి నిబంధనలను కఠినతరం చేస్తామని ఆయన చెప్పారు. భక్తులు సంప్రదాయ దుస్తుల్లో స్వామివారి దర్శనానికి వస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షణ చేసే భక్తులకు రూ. 10లకు లడ్డూ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

ఈ నెలాఖరులోగా తిరుపతిలో ఈ - దర్శనం కౌంటర్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. భక్తుల సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అవసరమైతే మహా లఘు దర్శనాన్ని రద్దు చేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X