హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐఐటి - హైదరాబాద్ నుంచి గే కార్యకర్తకు ఉద్వాసన

By Pratap
|
Google Oneindia TeluguNews

Ashley Tellis
హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - హైదరాబాద్ (ఐఐటి - హైదరాబాద్) నుంచి ఫ్యాకల్టీ సభ్యుడు అశ్లే టెల్లిస్ కుఉద్వాసనకు గురయ్యాడు. గే కార్యకలాపాల కార్యకర్త కావడమే అందుకు కారణం. ఇరవై ఏళ్ల బోధనానుభవం గల ఆ అధ్యాపకుడిని పక్షం రోజుల కిందట తొలగించినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. చట్టవిరుద్ధమైన ప్రవర్తనకు అతన్ని తొలగిస్తున్నట్లు సంస్థ చెప్పింది. ఈ విషయంపై మాట్లాడడానికి ఐఐటి - హైదరాబాద్ డైరెక్టర్ ఉదయ్ దేశాయ్ అందుబాటులో లేరని పత్రిక రాసింది.

గే కార్యకలాపాలకు ఎఎంయుకు చెంది ఎస్ఆర్ సిరాస్ కు ఉద్వాసన చెప్పినప్పటి నుంచి టెల్లీస్ ను తొలగించడానికి ఐఐటి - హైదరాబాద్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తనను అకస్మాత్తుగా తొలగించడంపై వివరాలు కావాలంటూ టెల్లీస్ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్నాడు. టెల్లిస్ లిబరల్ ఆర్ట్ డిపార్ట్ మెంటులో అసిస్టెంటు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. దేశంలో గే హక్కుల ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. కేంబ్రిడ్జీ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్ డి పట్టా తీసుకున్న అతను పలు పుస్తకాలు కూడా రాశాడు. అశ్లే ఐఐటి - హైదరాబాదులో చేరడంపై కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X