తెలంగాణ ఉప ఎన్నికలపై నేతల మాటలపై రోశయ్య గరం

Srinivas
హైదరాబాద్: తెలంగాణలోని 12 శాసనసభా స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో పోటీపై తమ కాంగ్రెసు పార్టీ నేతలు ప్రకటనలు చేయడంపై ముఖ్యమంత్రి కె. రోశయ్య శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తొలుత ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ముఖ్యమంత్రి కె. రోశయ్యతో మాట్లాడారు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి దానం నాగేందర్, ఆదిలాబాద్ జిల్లా నాయకులతో రోశయ్య, శ్రీనివాస్ మాట్లాడారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పార్టీ నాయకులపై ఆగ్రహించారు.

ఉప ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహించి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన నాయకులకు సూచించారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని కొందరు నాయకులు చేస్తున్న ప్రకటనలపై ఆయన తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+