ముఖ్యమంత్రి రోశయ్యకు మంత్రివర్గ విస్తరణ గండాలు

Rosaiah
హైదరాబాద్: కాంగ్రెసు అధిష్టానం ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటికీ రోశయ్య తనదంటూ ఓ జట్టును ఏర్పాటు చేసుకోలేపోతున్నారు. మంత్రివర్గ విస్తరణ చేయాలనుకున్న ప్రతిసారీ ఆయనకు ఎదో ఒకటి అడ్డు వస్తూనే ఉన్నది. ప్రకృతి వైపరీత్యాలో, రాజకీయ సంక్షోభాలో ఆయనకు అడ్డు వస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గంతోనే ఆయన కాలం వెళ్లబుచ్చుతూ వస్తున్నారు. నిజానికి, మంత్రివర్గ విస్తరణకు పార్టీ అధిష్టానం నెల రోజుల క్రితమే పచ్చజెండా ఊపింది. అయినా అందుకు ఆయన నడుం బిగించడం లేదు.

ఇంతకు ముందు ఆయనకు రాజ్యసభ ఎన్నికలు అడ్డం వస్తే ఇప్పుడు తెలంగాణలో జరిగే శాసనసభ ఉప ఎన్నికలు అడ్డు వస్తున్నాయి. అయితే, వైయస్ అనుచరులైన మంత్రులు ఒక్కరొక్కరే రోశయ్యకు సహకరిస్తూ వస్తున్నారు. మొదట్లో వారు పూర్తిగా సహాయ నిరాకరణ చేపట్టారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందువల్ల రోశయ్య ఏదో సాకు చెబుతూ ఇలాగే కాలం వెళ్లబుచ్చుతారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఉండదని ఒక్కసారి ప్రకటిస్తే రోశయ్యకు సీనియర్ల అండదండలు దూరం కావచ్చు. మంత్రివర్గ విస్తరణ జరిపితే కొంత మంది తిరుగుబాటు చేయవచ్చు. ఏం చేసినా కష్టాలు తప్పేట్టు లేదు. దాంతో అటూ ఇటూ కాకుండా వేల్లాడడమే మంచిదని ఆయన భావిస్తూ ఉండవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+