వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు నాయుడు కంటతడి: రాత్రీ భోజనం తీసుకునేందుకు ససేమిరా

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
ధర్మాబాద్: తమను అర్థరాత్రి ఔరంగబాద్‌కు తరలించడాన్ని చంద్రబాబు వ్యతిరేకించడంతో తెలుగుదేశం నాయకులను సోమవారం రాత్రి ధర్మాబాద్‌లోనే ఉంచారు. మహారాష్ట్ర పోలీసులు రాత్రి పదిన్నర గంటల సమయంలో చంద్రబాబు వద్దకు భోజనం తీసుకువచ్చారు. తినేందుకు ఆయన తిరస్కరించారు. ఉదయం నుంచి దీక్షలో ఉన్న చంద్రబాబునాయుడు దీక్ష విరమణ అనంతరం కూడా ఏమీ తీసుకోలేదు. దీంతో నాందేడ్‌ రేంజ్‌ ఐజీ యాదవ్‌ గంటన్నర సేపు బతిమాలినా ఆహారం తీసుకోలేదు. ఎమ్మెల్యేలు కూడా ఆయనను ఒప్పించే యత్నం చేశారు. అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఆయన మెలకువతోనే ఉన్నారు. తమ నేతల పట్ల మహారాష్ట్ర పోలీసుల వ్యవహరిస్తున్న తీరు చూసి చంద్రబాబు చలించిపోయారు. నాలుగు రోజులుగా చిత్రవధకు గురి చేస్తున్న మహారాష్ట్ర పోలీసులపై సోమవారం రాత్రి ఆయన ఆగ్రహోదగ్రులయ్యారు. తనకు, తమ పార్టీ నేతలకు, మహిళా నేతలకు జరుగుతున్న అవమానాలు, అసౌకర్యాలపై నిలదీస్తూనే గద్గద స్వరంతో కంటతడి పెట్టారు.

చంద్రబాబు సహా 74 మంది తెదేపా నేతలకు ధర్మాబాద్‌ మెజిస్ట్రేట్‌ ఈ నెల 26 వరకు జ్యుడీషియల్‌ కస్టడిని పొడిగించింది. నాలుగు రోజులపాటు ఐటీఐ కళాశాలలో ఉంచిన నేతలను సోమవారం రాత్రి ఔరంగాబాద్‌ జైలుకు తరలించటానికి మహారాష్ట్ర పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఐజీ శారదా ప్రసాద్‌ యాదవ్‌, ఎస్పీ సందీప్‌ కార్నిక్‌ల పర్యవేక్షణలో నేతల తరలింపునకు ఏర్పాట్లు జరిగాయి. టిడిపి నేతలకు చెందిన 24 సొంత వాహనాలకు మహారాష్ట్ర పోలీసులు అనుమతులు ఇచ్చారు. నేతలను తరలించేందుకు ఏర్పాటు చేసిన బస్సులతో పాటు 60కి పైగా మహారాష్ట్ర వాహనాలు ఏర్పాటు చేశారు. మొత్తం 100 వాహనాలతో కాన్వాయ్‌ వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. నేతల కాన్వాయ్‌ వెళ్లడానికి ముందు, తర్వాత గంట తేడాతో ఇతర వాహనాలను అనుమతించకూడదని నిర్ణయించారు. నలుగురు నేతలకు పది మంది చొప్పున వందల మంది పోలీసులను ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X