హైదరాబాదులో లోకల్ రైలు ఢీకొని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Districts
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: హైదరాబాద్ లోకల్ రైలు ఎంఎంటిఎస్ ప్రమాదానికి మరో యువతి బలైంది. గురువారం ఎంఎంటిఎస్ రైలు ఢీకొని బెత్లాహాం నర్సింగ్ కాలేజీకి చెందిన థెరిస్సా అనే విద్యార్థిని సీతాఫల్ మండిలో ఎంఎంటిఎస్ రైలు ఢీకొని మరణించింది. ఆ ఘటన మరిచిపోక ముందే శుక్రవారం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన మరో యువతి ఎంఎంటిఎస్ రైలు ప్రమాదానికి గురైంది.
సనత్ నగర్ ప్రాంతంలోని ఫతేనగర్ ఎంఎంటిఎస్ రైలు ఢీకొని ఆ యువతి మరణించింది. పట్టాలు దాటుతుండగా వేగంగా వస్తున్న రైలు ఆ యువతిని ఢీకొట్టింది. దాంతో స్థానికులు ఆందోళనకు దిగారు. అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.