ఎట్టకేలకు మనసులో మాట బయటపెట్టిన కాయదు లోహర్!

ప్రముఖ నటి కాయదు లోహర్ తన అందంతో నటనతో దక్షిణాది సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. మోడలింగ్ రంగం నుంచి సినిమా ప్రపంచంలోకి ప్రవేశించిన ఈ ముద్దు గుమ్మ.. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. టాలీవుడ్, దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాయదు లోహర్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్ ప్రయాణం గురించి ఎంతో హుందాగా, సరదాగా ముచ్చటించారు. తన పెళ్లి, ప్రేమ జీవితంపై వస్తున్న ఊహాగానాలకు ఆమె తనదైన శైలిలో ఫుల్‌స్టాప్ పెట్టారు.

పెళ్లిపై క్లారిటీ
ఇంటర్వ్యూలో భాగంగా తన వైవాహిక జీవితం గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు కాయదు లోహర్ ఏ మాత్రం తడబడకుండా.. "అవును, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను" అని చాలా స్పష్టంగా, నిజాయితీగా సమాధానమిచ్చారు. తన జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టమని.. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ నిర్ణయం తీసుకుంటానని ఆమె పరోక్షంగా సూచించారు.

Kayadu Lohar Opens Up About Marriage Plans Says She Is Currently Single Full Details

సింగిలా? కమిటెడ్ ఆ?
ప్రస్తుతం కాయదు లోహర్ రిలేషన్ షిప్ స్టేటస్ గురించి అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఈ వీడియోలో.. "ప్రస్తుతం మీరు ఏ స్థితిలో ఉన్నారు? కమిటెడ్ ఆ లేక సింగిలా?" అని అడిగినప్పుడు.. ఆమె చాలా తెలివిగా తన కెరీర్ పట్ల ఉన్న నిబద్ధతను చాటుకున్నారు. "నేను ప్రస్తుతం నా పనికి కమిటెడ్" అంటూ ఆమె నవ్వుతూ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. తన వృత్తిని ఎంతగా ప్రేమిస్తుందో చెప్పడానికి ఈ సమాధానమే నిదర్శనం.

నవ్వులతో సాగిన ఇంటర్వ్యూ
ఈ ఇంటర్వ్యూ మొత్తం చాలా స్నేహపూర్వకంగా, నవ్వులతో సాగింది. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ప్రశ్నలను ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఎంతో హుందాగా స్వీకరించింది కాయదు లోహర్. కాయదు లోహర్ ముఖంలో కనిపించిన చిరునవ్వు, ప్రతి ప్రశ్నకు ఇచ్చిన జవాబులు ఇంటర్వ్యూకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తనను తాను ఎలా ప్రెజెంట్ చేసుకోవాలో కాయదుకి బాగా తెలుసని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. చివరగా.. తన కెరీర్, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత గురించి మాట్లాడుతూ.. "నేను మీకు చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఆన్సర్ ఇస్తున్నాను" అని చెప్పడం ద్వారా, తాను దేనికీ అతిగా ప్రాధాన్యత ఇవ్వకుండా, తన పనిని, జీవితాన్ని ఎలా ఆస్వాదిస్తుందో వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+