తెలుగు శ్రీరామ్ కే ఇండియన్ ఐడల్ పట్టాభిషేకం

ఇండియన్ ఐడల్ ఫైనల్ కు వెళ్లినా ఎవరు గెలుస్తారనేది చివరి వరకు చెప్పడం కూడా కష్టమే. కార్యక్రమాన్ని చూసి ఎవరు బాగా ప్రతిభను చూపించారన్నది అభిమానులు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో వారికి మద్దతు ప్రకటించాలి. పాటలు పాడటంలో ఎంత ప్రతిభ ఉన్నా, సెల్‌ఫోన్ల ద్వారా సంక్షిప్త సందేశాలు రావడం కూడా ముఖ్యమే. ఇంతకుముందు ఇండియన్ ఐడల్ పోటీల్లో కారుణ్య ఫైనల్స్‌కు చేరినా ఎస్ ఎంఎస్ ల్లో వెనకబడిపోవడంతో ఆయన రన్నరప్‌గా నిలిచాడు. ఈసారి శ్రీరామ్ గెలుపును కోరుకుంటూ చాలా మంది ఎస్‌ఎంఎస్‌లు పంపడం శ్రీరామ్‌కు కలిసివచ్చింది. అభిజీత్ సావంత్, సందీప్ ఆచార్య, ప్రశాంత్ తమాంగ్, సౌరభీలు ఇంతకుముందు ఇండియన్ ఐడల్స్‌గా విజయం సాధించారు. ప్రస్తుత విజేత శ్రీరామ్ ఈటీవీ నిర్వహించిన 'ఒక్కరే' పోటీలో విజేతగా నిలిచాడు. ఈటీవీ 'సై' ఫైనలిస్ట్. బిగ్ ఎఫ్ ఎంలో 'వాయిస్ ఆఫ్ ఆంధ్రా'గా ఎంపికయ్యాడు. ఇప్పటి వరకూ 5 తెలుగు సినిమాల్లో పాటలు పాడిన శ్రీరామ్ ఇంజినీరింగ్ చదువుకున్నాడు. సంగీతంలో ప్రవేశం ఉంది. సందీప్-సులేమాన్ కంపోజ్ చేసిన ఒక హిందీ సినిమాకు శ్రేయా ఘోషల్‌తో కలిసి ఒక పాట పాడారు.
-
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications