డిప్యూటీ సిఎంగా చిరంజీవి: వైయస్ జగన్ కు విరుగుడు?

Chiranjeevi
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెక్ పెట్టేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసి, అమలు చేయడానికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. సెప్టెంబర్ నెల ఈ విధమైన సంచలనాలకు కేంద్రం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైయస్ ప్రథమ వర్ధంతి సెప్టెంబర్ 2వ తేదీ తర్వాత వైయస్ జగన్ పై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని, అందుకు ప్రతిగా చిరంజీవికి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెడుతారని వార్తలు వచ్చాయి.

కాగా, చిరంజీవి రాయలసీమ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు కాబట్టి ఆ ప్రాంతానికి తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుంది. అదే సమయంలో తెలంగాణకు చెందిన దళిత నేతకు మరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కోస్తాంధ్రకు చెందిన రోశయ్యను ముఖ్యమంత్రిగా మార్చే అవకాశాలు లేకపోవడంతో అన్ని ప్రాంతాల మధ్య సమతుల్యత సాధించడానికి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆ రకంగా పార్టీని అన్ని ప్రాంతాల్లో బలోపేతం చేసి జగన్ వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+