అమెరికా నుంచే ఉగ్రవాద ఎగుమతి: వికీలీక్స్ వెల్లడి

అమెరికాను ఉగ్రవాద ఎగుమతి దేశంగా విదేశీయులు చూస్తే ఏమవుతుందనే శీర్షిక కింద ఆ పత్రాన్ని సిఐఎ రూపొందించింది. మరో 15వేల పేజీల రహస్య పత్రాలను త్వరలోనే బయపెడతామని వికీలీక్స్ తెలిపింది. ఉగ్రవాదం అమెరికా నుంచే విస్తరిస్తుందనేది తాజా పరిణామమేమీ కాదని తెలిపింది. అంతేకాకుండా అది మధ్య ప్రాచ్యం లేదా దక్షిణాసియా జాతి సంబంధం మాత్రమే ఉగ్రవాదానికి కారణం కాదని వ్యాఖ్యానించింది. సొంతగడ్డకు పొంచి ఉన్న ముప్పునకు కౌంటర్ టెర్రరిజం నిపుణులు ప్రదానంగా పరిగణనలోకి తీసుకుంటారని, ఆల్ ఖైదా, ఇతర ఉగ్రవాద గ్రూపులు ఇతర దేశాల్లో పనిచేయడానికి అమెరికన్లపై దృష్టి సారించాయని నివేదిక తెలిపింది. నివేదిక ప్రాధాన్యతను తగ్గించడానికి సిఐఎ ప్రయత్నించింది. భిన్న అభిప్రాయాలను ముందు పెట్టి, ఆలోచనను రేకెత్తించడమే నివేదిక ప్రయత్నమని తెలిపింది.












Click it and Unblock the Notifications