మహాభారతంలో అభిమన్యుడు వైయస్ జగన్: దానం నాగేందర్

Danam Nagender
హైదరాబాద్: మహాభారతంలోని పద్మవ్యూహంలో అభిమన్యుడిగా తమ కాంగ్రెసు పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ అభివర్ణించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం వల్ల మరణించిన వారిని ఓదార్పాలని ఎఐసిసి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఓదార్పు చేపట్టాలని ఎఐసిసి నిర్ణయించిన తర్వాత ఓదార్పు చేయడానికి పూనుకుంటే వైయస్ జగన్ కు చెడ్డ పేరు వస్తుందని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి రాముడైతే తాను హనుమంతుడిని అని గతంలో ప్రకటించుకున్న దానం నాగేందర్ ఇటీవలి కాలంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అధిష్టానం మాట వినకపోతే జగన్ పై వేటు తప్పదని ఆయన సోమవారంనాడు అన్నారు. జగన్ పై ఆయన వరుసగా ప్రకటనలు చేస్తూ అధిష్టానానికి, ముఖ్యమంత్రికి విధేయత ప్రకటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+