చిరంజీవి సినిమా అధినాయకుడు: రిజిష్టర్ చేసిన మధు?

స్టోరీపై చర్చల్లో చిరంజీవి బిజీగా ఉన్నట్లు సమాచారం. సినిమా ఠాగూర్ లా ఉండాలనేది ఆయన అభిమతమని అంటున్నారు. రెండు, మూడు కథలు ఇప్పటికే రెడీ అయ్యాయని, వాటిని చిరంజీవి పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. కాగా, మహిళా రాజ్యం నాయకురాలు శోభారాణికి చిరంజీవి సినిమాలో పాత్ర దొరికినట్లు కూడా చెబుతున్నారు. చిరంజీవికి ఆమె చెల్లెలి పాత్రను పోషిస్తున్నారని సమాచారం. ఈ విషయం విన్న శోభారాణి ఎగిరి గంతేస్తున్నారు. తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె ఓ టీవీ న్యూస్ చానెల్ తో చెప్పారు.












Click it and Unblock the Notifications