హైకోర్టు బెంచ్ తెచ్చుకుంటే విభజనే: లగడపాటి రాజగోపాల్

అయితే లాయర్లు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టకుండా డిసెంబర్ 31 వరకు ఆగాలని చెప్పారు. అంతవరకు కోర్టులకు తాళాలు వేయటం, జిల్లా బంద్ లు నిర్వహించటం మానుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. ఇప్పుడే బెంచ్ ఇస్తే అది రాష్ట్ర విభజనకు దారి తీస్తుందని ఆయన చెప్పారు. కొమరం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న వాళ్లు మొదట ఆయన విగ్రహాన్ని ఏర్పరిచి ఆ తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పారు. అయితే గిరిజనుల హక్కుల కోసం పోరాడిన అలాంటి యోధుల విగ్రహాలు రాష్ట్రమంతటా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఆయన విగ్రహాల్ని ఏర్పాటు చేయటానికి సుముఖంగానే ఉంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications