సినీ నటుడు అశోక్ కుమార్ ఇంట్లో రూ.50 లక్షల దొంగతనం

బాధితులు తమ ఇంట్లో దొంగతనం జరిగినట్లు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు. అయితే ఇంట్లో అంత డబ్బు ఉన్నదన్న విషయం ఎవరికి తెలుసనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. తెలిసిన వ్యక్తులు గానీ, తెలిసిన వ్యక్తుల ద్వారా విషయం తెలుసుకున్న వారెవరైనా ఈ దొంగతనానికి పాల్పడవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం నుండి దొంగతనం జరిగే వరకు అశోక్ కుమార్ ఇంటికి ఎవరు వచ్చి వెళ్లారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. క్లూస్ టీమ్ వేలి ముద్రలు సేకరిస్తోంది.












Click it and Unblock the Notifications