హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబును అడుగడుగునా అడ్డుకుంటున్న తెలంగాణవాదులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి అడుగడుగునా తెలంగాణవాదుల నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆయన మంగళవారం తన రంగారెడ్డి జిల్లా పర్యటనను ప్రారంభించారు. తొలుత ఆయనను తెలంగాణవాదులు నాగోల్ చౌరస్తాలో అడ్డుకోవడానికి ప్రయత్నించారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ చంద్రబాబు కాన్వాయ్ కి అడ్డం పడే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణవాదులను తిప్పికొట్టడానికి తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కూడళ్లలో తెలుగు యువత, తెలుగు విద్యార్థి కార్యకర్తలను మోహరించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కాగా, మైక్రో ఫైనాన్స్ ల తీరుపై చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల రుణాలను చెల్లించవద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రుణాల వసూళ్లకు వచ్చినవారిని కట్టేసి కొట్టి తరిమేయాలని ఆయన ప్రజలకు సూచించారు. కాంగ్రెసు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని ఆయన విమర్శించారు. మైక్రో ఫైనాన్స్ రుణాలపై మారిటోరియం విధించాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X