హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాకొద్దీ రాయల తెలంగాణ: నాగం జనార్ధన్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: రాయల తెలంగాణను మేం సమ్మతించమని తెలుగు దేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటినుండి రాయలసీమ వారి వల్ల మేం చాలా నష్టపోయామని చెప్పారు. ఆంధ్రతో పాటు రాయలసీమ వారు తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. రాయల తెలంగాణను తాము వ్యతిరేకిస్తున్నట్టు శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చామని చెప్పారు. 1956 నుండి తెలంగాణకు జరుగుతున్న అన్నాయాన్ని అందులో వివరించామన్నారు.

మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ ప్రత్యేక హైదరాబాద్ రాష్ట్రం అనడం పట్ల ఆయన ఆక్షేపించారు. దానం, ముఖేష్ లు రాజకీయ లాభం కోసమే అలా అంటున్నారని, హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఎలా ఆమోదిస్తామని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా కూడా ఆమోదించబోమని తేల్చి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X