జగన్ మామ ఇంట్లో అబ్బాయితో వైయస్ వివేకానంద రెడ్డి చర్చలు

YS Vivekananda Reddy
కడప: బాబాయ్, అబ్బాయిల మధ్య సయోధ్య కుదిర్చేందుకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. వైయస్ జగన్ ను వీడి కాంగ్రెసుతో ఉండాలని నిర్ణయించుకున్న వైయస్ వివేకానంద రెడ్డి మనసు మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వైయస్ వివేకాతో వారంతా ఫోన్ లో మాట్లాడారు. వైయస్ జగన్ తో సయోధ్య కుదిర్చేందుకు వైయస్ జగన్ మామ రంగంలోకి దిగినట్లు సమాచారం. వైయస్ జగన్ తో ఉండడానికి ఇప్పటికీ వైయస్ వివేకానంద రెడ్డి నిరాకరిస్తున్నట్లు సమాచారం. వైయస్ జగన్ మామ గంగిరెడ్డి నివాసంలో వైయస్ జగన్, వైయస్ వివేకానంద రెడ్డి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. వృత్తిరీత్యా వైద్యుడైన గంగిరెడ్డి వారి మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

సోనియా వెంట ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని వైయస్ వివేకానంద రెడ్డి జగన్ కు సూచించినట్లు సమాచారం. ఆ మాటను వినడానికి జగన్ ఇష్టంగా లేరని అంటున్నారు. వైయస్ వివేకాకు, జగన్ కు మధ్య చర్చలు గంగిరెడ్డి నివాసంలో అర్థాంతరంగా ముగిసినట్లు సమాచారం. తిరిగి మంగళవారం వారిద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. హైదరాబాదు నుంచి కడపకు వచ్చిన వైయస్ వివేకానంద రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు, మంత్రి పదవి తీసుకోవడానికి నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆయన మంత్రి పదవి నిరాకరించినప్పటికీ వైయస్ జగన్ వెంట నడవడం వైయస్ వివేకాకు ఇప్పటికీ ఇష్టం లేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+