హైకమాండ్ కు కళ్లు, చెవులు ఉన్నాయి: ఎంపీ వి హనుమంతరావు
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కళ్లు, చెవులు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఆదివారం విలేకరులతో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఆ పరిణామాలన్నింటినీ అధిష్టానం గమనిస్తుందని విహెచ్ అన్నారు. అధిష్టానం అందరి అసంతృప్తిని పరిష్కరిస్తుందన్నారు. చిన్నశాఖ వచ్చిన వారు పెద్దశాఖ కోసం తాపత్రయపడటం సహజమేనన్నారు. రోశయ్యను మార్చి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ ను నియమించడంలో మాలాంటి సీనియర్ల సలహాలు తీసుకోవటం లేదని అనడంలో అర్థం లేదన్నారు. అధిష్టానానికి ఏం చేయాలో తెలుసునన్నారు. రాష్ట్రంపై అథిష్టానం ప్రత్యేక దృష్టి పెడుతుందని మీడియా వాళ్లే చెప్పారని దాంతో రాష్ట్రానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థమవుతుందో తెలుస్తుందన్నారు.