తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రభాకర్ అలక: రాజీనామా హెచ్చరిక

తెలుగుదేశం ఇతర శాసనసభ్యులు వచ్చి సర్దిచెప్పినా ఆయన వినలేదు. తనను అవమానించినందుకు క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. సభలో స్పీకర్ తోనే తేల్చుకుందామని తోటి శాసనసభ్యులు చెప్పారు. అయినా వినకపోవడంతో తెలుగుదేశం శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కలిశారు. ఆయన హామీ ఇవ్వడంతో ప్రభాకర్ లోనికి వచ్చారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డిని కూడా భద్రతా సిబ్బంది లోనికి వెళ్లనీయలేదు. దీంతో ఆయన ఓ నమస్కారం పెట్టి సిఎల్పీ కార్యాలయంలోకి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications